జైడస్ క్యాడిలా కరోనా వ్యాక్సిన్ మొదటిదశ ట్రయల్స్ సక్సెస్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం చేసిన మొదటి దశ ట్రయల్స్ ఫలితాలు సురక్షితంగా, ప్రభావవంతగా ఉన్నాయని బుధవారం వెల్లడించింది. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఆగష్టు 6 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. మొదటి దశ ట్రయల్స్‌లో ఆరోగ్యకరమైన వాలంటీర్లకు కొవిడ్-19 వ్యాక్సిన్ జైకోవ్-డి అందించామని కంపెనీ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని, వాలంటీర్లు బాగా తట్టుకున్నారని తేలినట్టు కంపెనీ వివరించింది. మొదటి దశ ట్రయల్స్ జులై […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం చేసిన మొదటి దశ ట్రయల్స్ ఫలితాలు సురక్షితంగా, ప్రభావవంతగా ఉన్నాయని బుధవారం వెల్లడించింది. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఆగష్టు 6 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. మొదటి దశ ట్రయల్స్‌లో ఆరోగ్యకరమైన వాలంటీర్లకు కొవిడ్-19 వ్యాక్సిన్ జైకోవ్-డి అందించామని కంపెనీ పేర్కొంది.
ఈ వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని, వాలంటీర్లు బాగా తట్టుకున్నారని తేలినట్టు కంపెనీ వివరించింది. మొదటి దశ ట్రయల్స్ జులై 15న ప్రారంభమైనట్టు కంపెనీ తెలిపింది. జైకోవ్-డి మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ను అధిగమించడం మైలురాయి లాంటిదని, మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని రకాల విషయాలను క్లినికల్ ఫార్మకోలాజికల్ యూనిట్‌లో 24 గంటల పాటు ఏడు రోజులు నిశితంగా పరిశీలించినట్టు జైడస్ క్యాడిలా ఛైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ తెలిపారు. తాము ఇప్పుడు రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించనున్నామని, ఈ దశలో టీకా భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేయడానికి వీలు ఉంటుందని భావిస్తున్నట్టు పంకజ్ వెల్లడించారు.