సచిన్‌కు యూవీ మరో కొత్త సవాల్
దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన క్రికెటర్లరో కొందరు అభిమానులతో, తోటి ఆటగాళ్లతో లైవ్ చాటింగ్‌లు చేస్తూ కాలం గడిపేస్తుండగా, మరికొందరు మాత్రం సరికొత్త సవాళ్లను ఒకరికొకరు విసురుకుంటూ తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వరుస టాస్క్‌లు చేస్తూ, తనలా చేయాలంటూ తోటి ఆటగాళ్లకు ఛాలెంజ్ విసురుతున్నాడు. గతంలో ‘కీప్ ఇట్ అప్’ ఛాలెంజ్ పేరుతో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మలకు యూవీ సవాల్ విసిరిన విషయం […]
దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన క్రికెటర్లరో కొందరు అభిమానులతో, తోటి ఆటగాళ్లతో లైవ్ చాటింగ్‌లు చేస్తూ కాలం గడిపేస్తుండగా, మరికొందరు మాత్రం సరికొత్త సవాళ్లను ఒకరికొకరు విసురుకుంటూ తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వరుస టాస్క్‌లు చేస్తూ, తనలా చేయాలంటూ తోటి ఆటగాళ్లకు ఛాలెంజ్ విసురుతున్నాడు. గతంలో ‘కీప్ ఇట్ అప్’ ఛాలెంజ్ పేరుతో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మలకు యూవీ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఛాలెంజ్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వినూత్నంగా పూర్తి చేసి యూవీతో పాటు అభిమానులనూ సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో సచిన్‌కు యూవీ ‘వంటింట్లో వంద’ పేరిట మరో కొత్త చాలెంజ్ విసిరాడు. ఇందులో భాగంగా వంటింట్లో అప్పడాల కర్రతో బంతి కిందపడకుండా వందసార్లు కొట్టాలి. ఈ చాలెంజ్‌ను యువరాజ్ కళ్లకు గంతలు కట్టుకొని పూర్తి చేశాడు. అనంతరం సచిన్‌కు సవాల్ విసిరాడు. ‘మాస్టర్ ఇప్పటివరకు మైదానంలో మీరు ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఈ సారి ‘కిచెన్‌లో సెంచరీ’ రికార్డును బ్రేక్ చేయండి. అయితే, వంటింట్లోని మిగతా సామాగ్రిని మాత్రం బ్రేక్ చేయకండి’ అంటూ సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.