పరువుహత్య కేసులో మరో ట్విస్ట్..!

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో జరిగిన పరువుహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.హేమంత్ హత్య కోసం అమ్మాయి మేనమామ కిరాయి గూండాలకు రూ.10లక్షలు సుపారీ ఇచ్చినట్లు తేలింది. వివరాల్లోకి వెళితే.. హేమంత్, అవంతి చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువురి కులాలు వేర్వేరు కావడంతో అమ్మాయి తరఫు కుటుంబీకులు ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా వారిద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం గచ్చిబౌలి సమీపంలోని ఎన్‌జీవోస్ కాలనీలో కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే అమ్మాయిని తమతో తీసుకెళ్లడానికి […]

Update: 2020-09-25 06:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

హైదరాబాద్‌లో జరిగిన పరువుహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.హేమంత్ హత్య కోసం అమ్మాయి మేనమామ కిరాయి గూండాలకు రూ.10లక్షలు సుపారీ ఇచ్చినట్లు తేలింది. వివరాల్లోకి వెళితే.. హేమంత్, అవంతి చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువురి కులాలు వేర్వేరు కావడంతో అమ్మాయి తరఫు కుటుంబీకులు ఒప్పుకోలేదు.

దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా వారిద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం గచ్చిబౌలి సమీపంలోని ఎన్‌జీవోస్ కాలనీలో కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే అమ్మాయిని తమతో తీసుకెళ్లడానికి ఆమె కుటుంబీకులు పలుమార్లు యత్నించగా అందుకు అమ్మాయి నిరాకరించింది. ఎలాగైనా అవంతిని ఇంటికి తీసుకెళ్లేందుకు అబ్బాయి తల్లిదండ్రులను పలుమార్లు బెదిరింపులకు గురిచేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం అమ్మాయి, అబ్బాయిని కారులో ఎక్కించుకుని మాట్లాడుకుందామని బయటకు తీసుకెళ్లారు.

నగర శివార్లకు వెళ్ళాక ప్రేమజంట కారులో నుంచి తప్పించుకుంది. గమనించిన అమ్మాయి మేనమామ యుగంధర్ రెడ్డి అబ్బాయిని వెంబడించి పట్టుకుని కిరాయి గూండాల సాయంతో దారుణంగా హతమార్చారు. అంతకుముందే అవంతి అత్తింటికి ఫోన్ చేసి అసలు విషయం వివరించగా, ఆమె 100కు డయల్ చేసింది. యుగంధర్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసిన పోలీసులు అతనితో పాటు మరో 11మందిని అదుపులోకి తీసుకున్నారు. హేమంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యుగంధర్ రెడ్డిని శుక్రవారం విచారించగా అసలు విషయం వెల్లడైంది.హేమంత్‌ను హత్య చేయించేందుకు కిరాయి హంతకులకు రూ.10లక్షలు సుపారీ ఇచ్చినట్లు అతను నేరం అంగీకరించాడు. నిందితుని స్టేట్మెంట్ రికార్డు చేసి, ఈ హత్య కేసులో మిగతా వారిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News