రఘురామకృష్ణం రాజుకు వైఎస్సార్సీపీ షోకాజ్ నోటీసులు

దిశ, ఏపీ బ్యూరో: గత కొంత కాలంగా వైఎస్సార్సీపీలో అసమ్మతి రాగం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై పార్టీ క్రమ శిక్షణా చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పనితీరుతో పాటు, సొంత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో విభేదాలు రాజేసుకున్న రఘురామకృష్ణం రాజు తాజాగా వైఎస్సార్సీపీ విడుదల చేసిన ఎస్ఈసీ, సుజనా, కామినేని పుటేజీపై కూడా పార్టీ వ్యతిరేకగళమెత్తడాన్ని సహించలేకపోయింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నోటీసులకు ఎంపీ రఘురామకృష్ణంరాజు నుండి సరైన సమాధానం […]

Update: 2020-06-24 02:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: గత కొంత కాలంగా వైఎస్సార్సీపీలో అసమ్మతి రాగం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై పార్టీ క్రమ శిక్షణా చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పనితీరుతో పాటు, సొంత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో విభేదాలు రాజేసుకున్న రఘురామకృష్ణం రాజు తాజాగా వైఎస్సార్సీపీ విడుదల చేసిన ఎస్ఈసీ, సుజనా, కామినేని పుటేజీపై కూడా పార్టీ వ్యతిరేకగళమెత్తడాన్ని సహించలేకపోయింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నోటీసులకు ఎంపీ రఘురామకృష్ణంరాజు నుండి సరైన సమాధానం అంటే వివరణ లేని పక్షంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముంది. కాగా, రఘురామకృష్ణం రాజు కూడా పార్టీ నుంచి వెళ్లకుండా పార్టీ సస్పెన్షన్ వరకు వెయిట్ చేస్తున్నట్టు.. సస్పెన్షన్ తరువాత బీజేపీలో చేరేందుకు స్కెచ్ వేసినట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News