ప్రజా సంకల్పానికి నాలుగేళ్లు.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
దిశ, ఏపీ బ్యూరో: ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించి నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ పాదయాత్ర జగన్ రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఈ పాదయాత్ర మొదలు పెట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం తాను యాత్రను చేసినట్టు చెప్పుకొచ్చారు. ‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, […]
దిశ, ఏపీ బ్యూరో: ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించి నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ పాదయాత్ర జగన్ రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఈ పాదయాత్ర మొదలు పెట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం తాను యాత్రను చేసినట్టు చెప్పుకొచ్చారు. ‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది’’ అని సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రజాసంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 6, 2021