సూట్‌కేస్‌లాంటి ఇంట్లో 24 గంటలు
దిశ, వెబ్‌డెస్క్ : సూట్‌కేస్‌లాంటి ఓ చిన్న ఇంట్లో ఉండటం సాధ్యమా? అసలు ఆ ఊహే.. ఇరుకుగా అనిపిస్తుంది కదా! కనీసం కాళ్లు కూడా సరిగ్గా పెట్టుకోలేనంత స్థలంలో ఎలా ఉండగలం? అనే ప్రశ్న తలెత్తడంలో ఆశ్చర్యమే లేదు. కానీ అమెరికన్ యూట్యూబర్ ర్యాన్ ట్రాహన్ ‘ప్రపంచంలోనే అతి చిన్న ఎయిర్ బీఎన్‌బీ’లో 24 గంటల పాటు నివసించి రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఎన్నో చాలెంజ్‌లతో విశ్వవ్యాప్త నెటిజన్లను ఆకట్టుకున్న ర్యాన్ మరోసారి రేర్ ఫీట్‌తో అదరగొట్టాడు. […]
దిశ, వెబ్‌డెస్క్ : సూట్‌కేస్‌లాంటి ఓ చిన్న ఇంట్లో ఉండటం సాధ్యమా? అసలు ఆ ఊహే.. ఇరుకుగా అనిపిస్తుంది కదా! కనీసం కాళ్లు కూడా సరిగ్గా పెట్టుకోలేనంత స్థలంలో ఎలా ఉండగలం? అనే ప్రశ్న తలెత్తడంలో ఆశ్చర్యమే లేదు. కానీ అమెరికన్ యూట్యూబర్ ర్యాన్ ట్రాహన్ ‘ప్రపంచంలోనే అతి చిన్న ఎయిర్ బీఎన్‌బీ’లో 24 గంటల పాటు నివసించి రికార్డు సృష్టించాడు.
ఇప్పటికే ఎన్నో చాలెంజ్‌లతో విశ్వవ్యాప్త నెటిజన్లను ఆకట్టుకున్న ర్యాన్ మరోసారి రేర్ ఫీట్‌తో అదరగొట్టాడు. కాగా ర్యాన్ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇక తాజా రికార్డు విషయానికి వస్తే.. 25 స్క్వేర్ ఫీట్ సైజులో ఉన్న వరల్డ్స్ స్మాలెస్ట్ ‘ఎయిర్ బీఎన్‌బీ’లో 24 గంటల పాటు నివసిస్తానంటూ చాలెంజ్ చేసిన ర్యాన్.. తాజాగా తాను అనుకున్నది సాధించి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాడు. ర్యాన్ కోసం అతడి స్నేహితులు పిజ్జాలు, కాఫీ తీసుకురావడం.. ఆ చిట్టి పొట్టి ఇంట్లో ఎంతో ఎంజాయ్ చేస్తూ వాటిని తినడం.. తన స్నేహితులు ర్యాన్‌ను డిస్టర్బ్ చేసేందుకు ఆ బుజ్జి ఇంటి డోర్ కొట్టి పిలవడం చాలా ఫన్నీగా అనిపిస్తోంది. అంతేకాదు అంత చిన్న ఇంట్లో కూడా ఓ స్టౌవ్‌తో పాటు, లైట్లు, టాయిలెట్, మిని విండోలు ఉండటం విశేషం.
కాగా ర్యాన్.. తను చేసిన రేట్ ఫీట్‌కు సంబంధించిన పది నిమిషాల వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘నేను 24గంటల పాటు ఈ చిన్న ఇంట్లో ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను. ఐ యామ్ సో అసమ్’ అంటూ పేర్కొన్నాడు. ‘ఇది నెక్ట్స్ లెవల్ ర్యాన్.. నీకు మాత్రమే ఈ ఫీట్ సాధ్యం, నువ్వు చేసిన వీడియోలన్నింటిలో ఇదే ది బెస్ట్ వీడియో. వాట్ ఏ రేర్ ఫీట్ ర్యాన్, ఇలాంటి మరెన్నో చాలెంజ్‌లు నువ్వు పూర్తి చేయాలి’ అంటూ తన అభిమానులు కామెంట్లు చేశారు.
కాసేపు ఎటూ కదలకుండా ఉంటేనే కాళ్లన్నీ తిమ్మిర్లు వస్తాయి, అలాంటిది.. కాళ్లు ముడుచుకుని, తల ఎటూ తిప్పరాకుండా, శరీరమంతా కదపరాకుండా ఉన్న ఆ చిన్న ఇంట్లో 24 గంటల పాటు ఉండటమంటే రియల్లీ రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఖుదోస్ టూ ర్యాన్.