యూట్యూబ్ మ్యూజిక్‌లో న్యూ అప్డేట్

దిశ, ఫీచర్స్: గూగుల్ తన వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్‌కు క్రమంగా కొత్త ఫీచర్లను జోడిస్తోంది. వీడియోలోని ‘చాప్టర్’ మార్చడానికి స్క్రీన్ మీద ఎడమ, కుడి ట్యాప్ నావిగేషన్ సైన్స్‌ను పూర్తి స్క్రీన్ మోడ్‌లో యూజ్ చేయడానికి ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో పాటు కంటెంట్ క్రియేటర్స్ కోసం కొత్త సూపర్ థాంక్స్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టగా.. తాజాగా యూట్యూబ్ మ్యూజిక్‌లో మరో కొత్త ఫీచర్‌ని విడుదల చేసింది. ఇప్పటి వరకు యూట్యూబ్ […]

Update: 2021-08-13 08:11 GMT

దిశ, ఫీచర్స్: గూగుల్ తన వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్‌కు క్రమంగా కొత్త ఫీచర్లను జోడిస్తోంది. వీడియోలోని ‘చాప్టర్’ మార్చడానికి స్క్రీన్ మీద ఎడమ, కుడి ట్యాప్ నావిగేషన్ సైన్స్‌ను పూర్తి స్క్రీన్ మోడ్‌లో యూజ్ చేయడానికి ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో పాటు కంటెంట్ క్రియేటర్స్ కోసం కొత్త సూపర్ థాంక్స్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టగా.. తాజాగా యూట్యూబ్ మ్యూజిక్‌లో మరో కొత్త ఫీచర్‌ని విడుదల చేసింది.

ఇప్పటి వరకు యూట్యూబ్ మ్యూజిక్ యూజర్లు యాప్‌లో పాట కోసం వెతికినప్పుడు అది యాప్‌లోని స్ట్రీమబుల్ పాటలను మాత్రమే చూపించేంది. 9To5 గూగుల్ నివేదిక ప్రకారం.. ఇకపై ప్రస్తుతమున్న లైబ్రరీ, అప్‌లోడ్ ట్యాబ్‌ల మధ్య కొత్తగా ‘డౌన్‌లోడ్‌’ ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది. యాప్‌లో లోకల్‌గా లభించే పాటలను ఈ ట్యాబ్ సోర్స్ చేస్తుంది. ఇది పాటలు, ఆల్బమ్స్, ప్లే‌లిస్ట్ ఫలితాలతోపాటు ‘యువర్ లైక్స్’ ఆటో ప్లేలిస్ట్‌ని కూడా ఇది చూపిస్తుంది. అయితే ఇందులో ’ఆర్టిస్ట్ లిస్ట్’ చేర్చలేదని సమాచారం. ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ డౌన్‌లోడ్ లిస్ట్‌లోని పాటలను వినొచ్చని నైన్‌టుఫైవ్ తెలిపింది.

ఆండ్రాయిడ్ వినియోగదారులకే ఇది పరిమితం కాగా, యూట్యూబ్ మ్యూజిక్ వెర్షన్ 4.40 తో ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. యూట్యూబ్ మ్యూజిక్ iOS ఆధారిత యాప్‌లో ఈ ఫీచర్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News