శానిటైజర్ రాస్తా అని అత్యాచారం

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రోజురోజుకు కామాందుల అరాచకాలు ఎక్కువైతున్నాయి. కామంతో కళ్లు మూసుకపోయి కన్ను, మిన్ను కానరాక దారుణాలకు ఒడిగడుతున్నారు. స్కూల్ కు వెళ్లే బాలికపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారిపై ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇందుకు ఉదాహరణ. విషయమేమంటే.. ఏపీలోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో స్కూలుకు వెళ్లే బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. […]

Update: 2020-08-24 22:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రోజురోజుకు కామాందుల అరాచకాలు ఎక్కువైతున్నాయి. కామంతో కళ్లు మూసుకపోయి కన్ను, మిన్ను కానరాక దారుణాలకు ఒడిగడుతున్నారు. స్కూల్ కు వెళ్లే బాలికపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారిపై ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇందుకు ఉదాహరణ.

విషయమేమంటే.. ఏపీలోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో స్కూలుకు వెళ్లే బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు పనికెళ్లిన సమయంలో ఆ యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను శానిటైజర్ రాస్తానంటూ బాత్ రూంకి తీసుకెళ్లి మాయమాటలు చెప్పి రేప్ చేశాడు. దీంతో ఆ బాలిక తన తల్లిదండ్రులు పని ముగించుకుని తిరిగి ఇంటికొచ్చిన తర్వాత విషయం చెప్పింది. విషయం తెలిసిన ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News