ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు.. జనసేనతో వైసీపీకి ప్రమాదం

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణ ఆంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా మారే అవకాశాలు తొందర్లోనే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారనుందని అన్నారు. అంతేగాకుండా… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎంగా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం చూస్తే, […]

Update: 2021-03-30 05:58 GMT
MP Raghurama Krishnam Raju
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణ ఆంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా మారే అవకాశాలు తొందర్లోనే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారనుందని అన్నారు. అంతేగాకుండా… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎంగా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం చూస్తే, తమ పార్టీకి ప్రమాదం జరుగడం ఖాయం అనే అనుమానం కలుగుతుందని వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చేధించకపోవడం బాధాకరమని అని విమర్శించారు.

Tags:    

Similar News