ఆంధ్రాను ఊటీ చేసింది… చాలదన్నట్టు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. విశాఖ కంటకుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. విశాఖ అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శించారు. ఆంధ్రా ఊటీని లూటీ చేసింది కాక ఇప్పుడు కొత్తగా కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. వచ్చిన పెట్టుబడులను వెనక్కి పంపాడని, […]
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. విశాఖ కంటకుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. విశాఖ అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శించారు.
ఆంధ్రా ఊటీని లూటీ చేసింది కాక ఇప్పుడు కొత్తగా కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. వచ్చిన పెట్టుబడులను వెనక్కి పంపాడని, సముద్రం చీలిపోతుందని, విశాఖ రాజధాని అయితే రాయలసీమ రౌడీలొచ్చేస్తారని విషం కక్కాడంటూ మండిపడ్డారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, రాయలసీమ రౌడీలు విశాఖ వస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని, అసలు ఈయన ఎక్కడివాడు? అంటూ విజయసాయి ఆగ్రహంతో ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.