ఆంధ్రా-ఒడిశా సీఎంలకు వైసీపీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 60 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపడం చాలా సంతోషకరమని వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎమ్మెల్యే జోగులు ఆంధ్రా, ఒడిశాఇద్దరు ముఖ్యమంత్రులుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజాం నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కోఠియా, జంఝావతి, శ్రీకాకుళం జిల్లాలోని నేరడి ప్రాజెక్ట్ సమస్యపై సానుకూల వాతావరణంలో చర్చించడం అభినందనీయమన్నారు. వీరి హయాంలో […]

Update: 2021-11-10 07:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 60 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపడం చాలా సంతోషకరమని వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎమ్మెల్యే జోగులు ఆంధ్రా, ఒడిశాఇద్దరు ముఖ్యమంత్రులుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజాం నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కోఠియా, జంఝావతి, శ్రీకాకుళం జిల్లాలోని నేరడి ప్రాజెక్ట్ సమస్యపై సానుకూల వాతావరణంలో చర్చించడం అభినందనీయమన్నారు.

వీరి హయాంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు సీఎం జగన్ లేఖ రాయడం.. ఒడిశా సీఎం సాదరంగా ఆహ్వానించడం, సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా అడుగు ముందుకు వేయడం శుభదాయకం అని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.

Tags:    

Similar News