గవర్నర్ నిర్ణయంపై.. స్పందించిన వైసీపీ

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఆయనను పదవి నుంచి తీసేయాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసినా, చివరకు ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఏపీ గవర్నర్ సైతం నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనిపై అధికార పార్టీ స్పందించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయమని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ […]

Update: 2020-07-22 06:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఆయనను పదవి నుంచి తీసేయాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసినా, చివరకు ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఏపీ గవర్నర్ సైతం నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనిపై అధికార పార్టీ స్పందించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయమని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరు సరిగ్గా లేదని విమర్శించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి… ఆయన రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరిపారని విమర్శించారు.

ఎన్ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా… రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దాన్ని గౌరవించాల్సిన పని లేదా ? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా నిమ్మగడ్డ ప్రవర్తించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఎందుకు రహస్యంగా కలుస్తున్నారని ప్రశ్నించారు. రూ. కోట్లు ఖర్చు చేస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. తనకు సంబంధించి వ్యక్తులే కీలకమైన పదవుల్లో ఉండేలా చంద్రబాబు తెర వెనుక కుట్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News