‘చంద్రబాబు మోడీ జుట్టు పట్టుకోవాలని చూశారు’

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి లేని పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కానీ చంద్రబాబు నైజం అలా ఉండదని, అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు వైఖరి అన్నారు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ జుట్టు పట్టుకోవాలని చూసిన చంద్రబాబు, ఇప్పుడు ఆయన కాళ్లు పట్టుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా […]

Update: 2020-07-16 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి లేని పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కానీ చంద్రబాబు నైజం అలా ఉండదని, అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు వైఖరి అన్నారు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ జుట్టు పట్టుకోవాలని చూసిన చంద్రబాబు, ఇప్పుడు ఆయన కాళ్లు పట్టుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంపై 52 పేజీల తప్పుడు ఆరోపణలతో రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురదచల్లడమే కాకుండా.. వారిపై తాము కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టు చెపుతున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డిలను తప్పు చేయకుండానే, ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని హత్య చేసేందుకు సహకరించిన కొల్లు రవీంద్రను వదిలిపెట్టాలా? అని అడిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అవినీతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రూ.151 కోట్ల అవినీతికి పాల్పడిన అచ్చెన్నను ఏం చయొద్దా అని ప్రశ్నించారు. విచారణలో తప్పులు భయటపడతాయనే భయంతోనే రాష్ట్రపతికి లేఖలు ఇస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News