నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా యాస్మీన్ బాధ్యతలు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్.కె. యాస్మీన్ భాషాకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. సోమవారం ఉదయం కలెక్టర్ బాధ్యతల నుంచి శ్రీధర్ రిలీవ్ అయ్యారు. సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ […]

Update: 2020-06-29 03:47 GMT
నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా యాస్మీన్ బాధ్యతలు
  • whatsapp icon

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్.కె. యాస్మీన్ భాషాకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. సోమవారం ఉదయం కలెక్టర్ బాధ్యతల నుంచి శ్రీధర్ రిలీవ్ అయ్యారు. సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్.కె. యాస్మీన్ భాషా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజా ఆరోగ్యం, హరితహారం, స్మశాన వాటికల నిర్మాణాలు, డంపింగ్ యాడ్ లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ అప్డేషన్, తదితర అంశాలపై దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. త్వరలోనే జిల్లా అధికారులతో జిల్లా ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

Tags:    

Similar News