మద్యం ధరలను తగ్గించాలి: యనమల
అమరావతి: ఏపీలో మద్యం ధరల పెంపుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. మద్యం కంపెనీల ఒత్తిళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వం ధరలను పెంచిందని ఆరోపించారు. ధరలు పెంచి ప్రజలపై రూ.5 వేల కోట్ల భారం మోపిందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే నాటుసారా ఏరులై పారుతోందని అన్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు […]
అమరావతి: ఏపీలో మద్యం ధరల పెంపుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. మద్యం కంపెనీల ఒత్తిళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వం ధరలను పెంచిందని ఆరోపించారు. ధరలు పెంచి ప్రజలపై రూ.5 వేల కోట్ల భారం మోపిందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే నాటుసారా ఏరులై పారుతోందని అన్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు సాగనున్నాయి.
Tags: tdp leader yanamal, lquor price rise, ap news