యాదాద్రిలో ఇష్టారాజ్యంగా విధుల నిర్వహణ.. డ్రెస్ కోడ్ పట్టించుకోని అధికారులు..

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి దేవస్థానం లో ఉద్యోగుల డ్రెస్ కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. ఏఈవో స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు అధికారులెవ్వరూ డ్రెస్ కోడ్ పాటించటంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా సమయసందర్భాలు లేకుండా వారి ఇష్టారీతిన విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆలయ పరిధిలో అటెండర్, ఇతర సిబ్బంది మాత్రం డ్రెస్ కోడ్ లో కన్పిస్తుంటారు. అధికారులు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడే కొంతమంది సిబ్బంది సివిల్ డ్రెస్ లో నే విధులు నిర్వహించడం […]

Update: 2021-11-05 03:53 GMT

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి దేవస్థానం లో ఉద్యోగుల డ్రెస్ కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. ఏఈవో స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు అధికారులెవ్వరూ డ్రెస్ కోడ్ పాటించటంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా సమయసందర్భాలు లేకుండా వారి ఇష్టారీతిన విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆలయ పరిధిలో అటెండర్, ఇతర సిబ్బంది మాత్రం డ్రెస్ కోడ్ లో కన్పిస్తుంటారు. అధికారులు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడే కొంతమంది సిబ్బంది సివిల్ డ్రెస్ లో నే విధులు నిర్వహించడం గమనార్హం. విశ్వక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానంలో కొంతమంది అధికారులు, సిబ్బంది ఎప్పటి నుంచో అమలులో ఉన్న డ్రెస్ కోడ్ పాటించడం లేదు. అంతేకాదు కనీసం ఐడి కార్డు కూడా వేసుకోరు.

ఆలయ ఈవో సమక్షంలోనే అధికారులు సివిల్ డ్రెస్ లో పాల్గొంటారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎదుట ఏఈవో, సూపరింటెండెంట్లు డ్రెస్ కోడ్ ఉల్లంఘించినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం లేదన్నది వాస్తవం. చర్యలు తీసుకుంటే ఇలా సివిల్ డ్రెస్ లో సమీక్షలు, విధులకు హాజరయ్యేవారా..? అని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ ఉద్యోగుల డ్రెస్ కోడ్ పట్ల ఈవో కఠినంగా వ్యవహరించకపోవడం వలనే అధికారులకు అలుసుగా మారిందని స్థానిక ప్రజా ప్రతినిధులు మండి పడుతున్నారు. వెంటనే ఆలయ ఈవో సదరు ఉద్యోగుల పట్ల చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News