ఆ చైనా వైద్యుడి రంగు తిరిగొచ్చింది
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ కొన్ని కోట్ల మందిపై ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకి తగ్గిపోయినప్పటికీ చాలామందిలో ఇప్పటికీ సైడ్ ఎఫెక్స్ట్ కనిపిస్తున్నాయి. కొంతమందిలో జుట్టు ఊడిపోతుంటే.. మరికొందరిలో నీరసం, చాతిలో నొప్పి తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే చైనాకు చెందిన డాక్టర్ యి ఫ్యాన్ కేసు మాత్రం కాస్త భిన్నమైంది. కరోనా సోకిన ఆ డాక్టర్‌కు వైద్యం అందించగా.. అతని చర్మం నల్లగా మారిపోయింది. ప్రస్తుతం తన చర్మం మళ్లీ […]
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్ కొన్ని కోట్ల మందిపై ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకి తగ్గిపోయినప్పటికీ చాలామందిలో ఇప్పటికీ సైడ్ ఎఫెక్స్ట్ కనిపిస్తున్నాయి. కొంతమందిలో జుట్టు ఊడిపోతుంటే.. మరికొందరిలో నీరసం, చాతిలో నొప్పి తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే చైనాకు చెందిన డాక్టర్ యి ఫ్యాన్ కేసు మాత్రం కాస్త భిన్నమైంది. కరోనా సోకిన ఆ డాక్టర్‌కు వైద్యం అందించగా.. అతని చర్మం నల్లగా మారిపోయింది. ప్రస్తుతం తన చర్మం మళ్లీ పూర్వస్థితికి వచ్చింది.
కరోనా పాండమిక్ వేళ.. ఎంతోమంది వైద్యులు ముందుండి బాధితులకు చికిత్స అందించారు. నిద్రాహారాలు మాని, సేవకే అంకితమయ్యారు. ఆ క్రమంలో చాలా మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. చైనాకు చెందిన డాక్టర్ యి ఫ్యాన్‌కు కూడా బాధితులకు చికిత్స అందిస్తున్న క్రమంలో కరోనా సోకింది. ఐసీయూలో ఉన్న ఆ వైద్యుడికి యాంటిబయోటిక్ డ్రగ్ ఇవ్వడంతో.. అతడి చర్మపు రంగు మారిపోయింది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక అతని కొలిగ్ లి వెన్‌లియాంగ్ కరోనాతో మరణించగా, మరొ కొలిగ్ హు విఫెంగ్ కూడా కరోనాతో ఐదు నెలల పాటు పోరాడి కన్నుమూశాడు. అయితే, విఫెంగ్ చర్మం కూడా ఫ్యాన్ మాదిరిగానే డార్క్ కలర్‌లోకి మారింది. కాగా ఫ్యాన్‌కు మాత్రం కొవిడ్ సోకిన ఐదు నెలల తర్వాత తన పూర్వపు రంగు రావడంతో బయటపడ్డాడు. డార్క్ స్కిన్ కలర్ కోల్పోయిన సంతోషంలో ఓ వీడియో విడుదల చేశాడు. కరోనా చాలా భయంకరమైనదని ఆయన ఆ వీడియోలో తెలియజేశాడు.
వైరస్ లోడ్.. డాక్టర్ లివర్స్‌ను డ్యామేజ్ చేయడంతో హార్మోనల్ ఇంబ్యాలన్స్ అయ్యాయని, దాని వల్ల అబ్‌నార్మల్ స్కిన్ కలర్ వచ్చిందని మెడికిల్ టీమ్ భావిస్తోంది. కరోనా నుంచి రికవర్ కావడంతో.. హైపర్ పిగ్మెంటేషన్ తగ్గి మళ్లీ తన రంగు పూర్వస్థితికి వచ్చిందని మెడికల్ టీమ్ వెల్లడించింది.