ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. ఎక్కడంటే
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. జమ్ము కశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జిపై 476 మీటర్ల పొడవైన ఆర్చ్‌ను ఉక్కుతో నిర్మిస్తుండగా.. మొత్తం బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. ఇక దీనికయ్యే వ్యయం రూ.1,250 కోట్లు. కాగా ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా లింక్ (USBRL) రైల్వే సెక్షన్లో జరుగుతున్న ఈ లైన్ నిర్మాణ పనులు పూర్తిచేయడం ద్వారా ఇండియన్ రైల్వేస్.. మరో ఇంజినీరింగ్ మైల్ స్టోన్‌ను […]
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. జమ్ము కశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జిపై 476 మీటర్ల పొడవైన ఆర్చ్‌ను ఉక్కుతో నిర్మిస్తుండగా.. మొత్తం బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. ఇక దీనికయ్యే వ్యయం రూ.1,250 కోట్లు. కాగా ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా లింక్ (USBRL) రైల్వే సెక్షన్లో జరుగుతున్న ఈ లైన్ నిర్మాణ పనులు పూర్తిచేయడం ద్వారా ఇండియన్ రైల్వేస్.. మరో ఇంజినీరింగ్ మైల్ స్టోన్‌ను అచీవ్ చేయబోతున్నదని రైల్వే మంత్రిత్వ శాఖ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఇక ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు 2004లోనే ప్రారంభం కాగా, 2009లో నిధులు మంజూరు కాక ఆగిపోయాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకోవడంతో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.