కొవిడ్‌పై పోరాటంలో పౌరసత్వం పొందిన రోబో

దిశ, ఫీచర్స్: కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఎంతో శ్రమించారు. ఇంకా శ్రమిస్తూనే ఉండగా.. వారి ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు మొదట వారికే వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మానవాళిని కరోనా నుంచి రక్షించేందుకు శాస్త్రవేత్తలు సాంకేతికత ఆధారంగా వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రపంచంలో పౌరసత్వం పొందిన తొలి ఫిమేల్ రోబో ‘సోఫియా’ను కొవిడ్‌పై పోరాటంలో ఉపయోగించేలా రూపొందిస్తున్నారు. వీటిని అధిక సంఖ్యలో తయారుచేసి మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ […]

Update: 2021-02-08 03:41 GMT

దిశ, ఫీచర్స్: కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఎంతో శ్రమించారు. ఇంకా శ్రమిస్తూనే ఉండగా.. వారి ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు మొదట వారికే వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మానవాళిని కరోనా నుంచి రక్షించేందుకు శాస్త్రవేత్తలు సాంకేతికత ఆధారంగా వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రపంచంలో పౌరసత్వం పొందిన తొలి ఫిమేల్ రోబో ‘సోఫియా’ను కొవిడ్‌పై పోరాటంలో ఉపయోగించేలా రూపొందిస్తున్నారు. వీటిని అధిక సంఖ్యలో తయారుచేసి మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

కొవిడ్ సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న గణనీయ మార్పులు.. నూతన ఆవిష్కరణలకు నాంది పలికాయి. మునుపటితో పోలిస్తే టెక్నాలజీ యూసేజ్ బాగా పెరిగింది. పని ప్రదేశాల్లో మానవుని రక్షణార్థం ఆటోమేషన్ టెక్నాలజీ పరికరాల ఉపయోగమూ పెరిగింది. అంతేకాదు కొవిడ్ వల్ల మానవ సంబంధాల్లోనూ మార్పులొచ్చి, ఇతరులతో మాట్లాడే పరిస్థితులు తగ్గిపోయి మానసిక ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో మనిషిని పోలిఉండే ‘సోఫియా’ రోబోను హాంగ్‌కాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించింది. కొవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఒంటరితనాన్ని ఫీల్ కాకుండా వారితో మాటలు కలిపే ఈ రోబో.. వారు చెప్పిన పనులు కూడా చేస్తుంది. తన ముఖంలో 50 రకాల ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇవ్వగలదు. కాగా ఈ రోబోలను భారీస్థాయిలో ఉత్పత్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలో మార్కెట్‌లో రిలీజ్ చేయాలని హన్సన్ రోబోటిక్స్ సంస్థ భావిస్తోంది.

Tags:    

Similar News