Largest Diamond : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం గుర్తింపు
దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని బోట్స్‌వానా దేశంలోని కరోవే గనిలో గుర్తించారు.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని బోట్స్‌వానా దేశంలోని కరోవే గనిలో గుర్తించారు. అది 2,492 క్యారెట్ల వజ్రమని లుకారా డైమెండ్ కార్పొరేషన్ గురువారం వెల్లడించింది. వజ్రాల గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్‌రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా ఈ అతిపెద్ద వజ్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
1905 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని గనిలో వెలికితీసిన 3,106 క్యారెట్ల కల్లినల్ వజ్రం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇప్పుడు బోట్స్‌వానా దేశంలో లభ్యమైన వజ్రం రెండో అతిపెద్దది. అయితే ఈ వజ్రం ధర ఎంత ఉంటుందనే వివరాలు తెలియరాలేదు. కాగా, ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్‌వానా ఒకటి.