పాకిస్థాన్‌లో కలకలం: మూడు యూనివర్సిటీల మూసివేత

భద్రతాపరమైన బెదిరింపుల కారణంగా పాకిస్థాన్ సైన్యానికి అనుబంధంగా ఉన్న మూడు విశ్వవిద్యాలయాలను సోమవారం మూసివేశారు.

Update: 2024-01-22 10:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పాకిస్థాన్‌లో ఉగ్రదాడుల భయం నెలకొంది. భద్రతాపరమైన బెదిరింపుల కారణంగా పాకిస్థాన్ సైన్యానికి అనుబంధంగా ఉన్న మూడు విశ్వవిద్యాలయాలను సోమవారం మూసివేశారు. పోలీసులు, సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే చాన్స్ ఉన్నట్టు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇస్లామాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీ, బహ్రియా విశ్వవిద్యాలయం, ఎయిర్ యూనివర్శిటీలను అధికారులు బంద్ చేశారు. ఇవి పాకిస్తాన్ సైన్యం, నౌకాదళం వైమానిక దళంతో ముడిపడి ఉన్నాయి. కాగా, పాక్‌లో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News