Turkey : ఇన్‌స్టాగ్రామ్‌ (INSTAGRAM) పై నిషేధం ఎత్తివేసిన టర్కీ

ఈ నెల ఆగస్టు 2న టర్కీ ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-08-12 23:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ నెల ఆగస్టు 2న టర్కీ ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. దేశంలోని చట్టాలు, నిబంధనలు పాటించడంలో ఇన్‌స్టాగ్రామ్‌ విఫలమైనందుకు టర్కీ ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం విధించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌పై టర్కీ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విధించిన షరతులను ఇన్‌స్టాగ్రామ్‌ అంగీకరించిందని, అలాగే అధికారులకు సహకరించడంతో తొమ్మిది రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు టర్కీ ప్రభుత్వం పేర్కొంది.కాగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అధ్యక్షుడు ఇస్మాయిల్ హనీయే హత్యపై సంతాప పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. అందువల్లే టర్కీ ప్రభుత్వం తమ దేశంలో ఈ నెల 2న ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News