మే-8: నేడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం..
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహిస్తారు.
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహిస్తారు. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్ హంట్ పుట్టిన రోజు (మే8 1828)న ఈ దినోత్సవం జరుపుకుంటారు. వివిధ సమస్యలతో భాదపడుతున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి. అలాంటివారందరి గౌరవిస్తూ ఈ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1859లో, రెండవ ఇటాలియన్ స్వాతంత్య్ర యుద్ధంలో ఇటలీలోని సోల్ఫెరినో యుద్ధభూమిలో గాయపడిన సైనికుల బాధలను డునాంట్ చూశాడు. ఈ అనుభవం అతన్ని "ఎ మెమరీ ఆఫ్ సోల్ఫెరినో" అనే పుస్తకాన్ని వ్రాయడానికి దారితీసింది, ఇది యుద్ధ సమయాల్లో గాయపడిన వారికి సహాయం చేయడానికి స్వచ్ఛంద సమూహాలను రూపొందించడానికి పిలుపునిచ్చింది. మొదటి రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని మే 8, 1948న జరుపుకున్నారు. 1984లో అధికారికంగా దీనికి ‘‘వరల్డ్ రెడ్ క్రాస్ డే’’ అని పేరు పెట్టారు.