నేడు ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం

ఏడాదిలో ప్రతి రోజుకీ ఏదోక ప్రత్యేకత ఉంటుంది.

Update: 2024-06-21 03:17 GMT

దిశ, ఫీచర్స్: ఏడాదిలో ప్రతి రోజుకీ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ రోజుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. నేడు ప్రపంచ మోటార్‌సైకిల్ దినోత్సవం. ప్రతి యేటా జూన్ 21ని ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నిజానికి ఈ రోజు ద్విచక్ర వాహనదారులందరికీ ఒక వేడుక లాంటిది. ఈ ప్రపంచ మోటార్‌సైకిల్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. మోటార్‌సైకిల్ ప్రియులు.. మోటార్‌సైకిళ్లను చాలా ఇష్ట పడతారు. వాటిని నడిపే వారు, తయారు చేసే వారు.. ఇలా ఎంతో మంది టూవీలర్ ప్రియులు, ఈ రోజును పండుగలా జరుపుకుంటారు. కానీ పెద్ద నగరాల్లో సైక్లిస్టులు గ్రూపులుగా ఏర్పడి, దూరప్రాంతాలకు వెళ్లి చిన్న రోడ్ ట్రిప్పులు ప్లాన్ చేసుకుని, రోజంతా సరదాగా గడుపుతుంటారు. 


Similar News