నేడు బుద్ద పూర్ణిమ.. దీని విశిష్టత ఏంటో తెలుసా..?

బుద్దిని జనన, మనణాలకు సంబంధించి ఖచ్చితమైన తేదీలు చెప్పలేరు కాబట్టి ప్రతి ఏడాది వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున బుద్ద పూర్ణిమ జరుపుకుంటారు.

Update: 2023-05-05 06:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుద్దిని జనన, మనణాలకు సంబంధించి ఖచ్చితమైన తేదీలు చెప్పలేరు కాబట్టి ప్రతి ఏడాది వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున బుద్ద పూర్ణిమ జరుపుకుంటారు. ఇది బుద్దిని జయంతిని పురస్కరించుకుని చేసుకునే పండుగ. పౌర్ణమి ఈ ఏడాది మే-5న వచ్చింది కాబట్టి ఈరోజు బుద్ద పూర్ణిమ జరుపుకుంటారు. దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

బుద్ద పూర్ణిమను తూర్పు, దక్షిణ ఆసియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, టిబెట్, థాయిలాండ్, చైనా, కొరియా, లావోస్, వియత్నాం, మంగోలియా, కాంబోడియా, ఇండోనేషియా, భారతదేశంలో బౌద్దులందరూ జరుపుకుంటారు. ఈ రోజును వారు చాలా ఆధ్యాత్మిక వేడుకలా చేసుకుంటారు. ఉదయాన్నే లేచి స్నానం ఆచరించడం, ఇళ్లను శుభ్రం చేసుకోవడం చేస్తారు. గంగాజలంతో ఇళ్లను శుభ్రం చేస్తారు. అనంతరం ఇంటిని పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దుతారు. బోధి వృక్షానికి పాలు పోసి కొవ్వొత్తులు వెలిగిస్తారు. పేద ప్రజలకు, అవసరమున్నవారికి ఈరోజు బట్టలు, ఆహారం దానం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు గౌతమ బుద్దుని బోధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటారు.

Tags:    

Similar News