శాండ్‌విచ్‌లో పదునైన కత్తి.. షాక్‌కు గురైన గర్భిణీ
దిశ, వెబ్‌డెస్క్ : బిజీబిజీ లైఫ్ లీడ్ చేస్తున్న నేటి సమాజం వంట చేసుకుని తినేందుకు కూడా సమయాన్ని కేటాయించలేకపోతుంది.
దిశ, వెబ్‌డెస్క్ : బిజీబిజీ లైఫ్ లీడ్ చేస్తున్న నేటి సమాజం వంట చేసుకుని తినేందుకు కూడా సమయాన్ని కేటాయించలేకపోతుంది. ఈ క్రమంలో ఇష్టమైన ఫుడ్స్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది. అయితే ఆర్డర్ చేసిన ఫుడ్ అయినా మంచిగా వస్తుందా అంటే.. అదీ లేదు. వెజ్ ఆర్డర్ చేస్తే నాన్‌వెజ్, నాన్‌వెజ్ ఆర్డర్ చేస్తే వెజ్ ఫుడ్స్. ఇక దీంతోపాటు ఆ ఫుడ్‌లో ఏదో ఒక జంతువుల అవయవాలు రావడం ఈ మధ్య చాలానే వైరల్ కావడం చూశాం. తాజాగా ఓ గర్భిణీ ఆర్డర్ చేసిన శాండ్‌విచ్‌లో పదునైన నైఫ్ రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
నెరిస్ మోయిస్ అనే 21ఏళ్ల గర్భిణీ తనకు ఇష్టమైన ట్యూనా సబ్‌ని శాండ్‌విచ్ చైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నారు. అనంతరం ఆ శాండ్‌విచ్‌ని ఓపెన్ చేసి తినే క్రమంలో పదునైన చాక్(నైఫ్) వాటి మధ్య ఉండటం చూసి ఒక్కసారిగా ఆమె ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆమె భర్త రెస్టారెంట్‌కు కాల్ చేసి చెప్పగా.. రెస్టారెంట్ యజమాని సిబ్బందితో మాట్లాడమని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇక వీటిపై సబ్‌వే ప్రతినిధి మెయిల్ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ.. 'అతిథులందరి ఆరోగ్యం, భద్రత మాకు చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ అతిథులకు సరైన ఉత్పత్తులను అందించాలని భావిస్తాము. ఇలా జరగడంపై మేము క్షుణ్ణంగా పరిశోధించాము. దీంతో మా బృందం వెంటనే కస్టమర్లకు క్షమాపణలు చెప్పిందని' ఆయన తెలిపారు.