బెలారస్‌లో రష్యా అణ్వాయుధాలు: Putin
బెలారస్‌లో రష్యా జులై 7-8 తేదీల్లో వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించడం ప్రారంభిస్తుంది.
మాస్కో: బెలారస్‌లో రష్యా జులై 7-8 తేదీల్లో వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించడం ప్రారంభిస్తుంది. అక్కడ సౌకర్యాలు పూర్తయిన తర్వాత మోహరింపు చర్యను ప్రారంభిస్తామని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ‘ప్రతి పని ప్రణాళిక ప్రకారం.. స్థిరంగా చేస్తాం’ అని పుతిన్ అన్నట్లు క్రెమ్లిన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యాకు చెందిన భూ ఆధారిత స్వల్ప శ్రేణి అణు క్షిపణులను తన సన్నిహిత మిత్ర దేశమైన బెలారస్ భూభాగంలో మోహరించే ప్రణాళికను రెండు దేశాధినేతలు ఆమోదించారు. ఆ క్షిపణులు రష్యా ఆధ్వర్యంలోనే పని చేస్తాయి.