Priti Patel:బ్రిటన్ మాజీ హోంమంత్రి ప్రీతీపటేల్‌కు బిగ్ షాక్..కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి
భారత సంతతికి చెందిన మహిళ,బ్రిటన్ మాజీ హోంమంత్రి 52 ఏళ్ల ప్రీతీ పటేల్(Priti Patel) కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: భారత సంతతికి చెందిన మహిళ,బ్రిటన్ మాజీ హోంమంత్రి 52 ఏళ్ల ప్రీతీ పటేల్(Priti Patel) కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.అయితే జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ(Conservative Party) ఓడిపోవడంతో రిషి సునాక్(Rishi Sunak) తన పదవి నుంచి నవంబర్ 2న వైదొలగనున్నారు.దీంతో ఆమె కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.ఈ ఎన్నికల్లో ఆమె మాజీ మంత్రులు జేమ్స్ క్లీవర్లీ(James Cleverly), టామ్ తుగేన్‌ధాట్(Tom Tugendhat), మెల్ స్ట్రైడ్(Mel Stride), రాబర్ట్ జెన్రిక్స్(Robert Jenricks), కెమీ బాడెనోచ్(Kemi Badenoch) లతో పోటీపడుతున్నారు.ఈ నేపథ్యంలో నిన్న జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ అభ్యర్థి మొదటి రౌండ్ ఓటింగ్ ఎన్నికల్లో ప్రీతి పటేల్ ఓటమి చెందారు.దీంతో ఆమె ఈ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు.కాగా ప్రీతీ పటేల్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson) ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా పని చేశారు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 4న జరిగిన విపక్షనేత ఎన్నికల్లో మాజీ ఇమ్మిగ్రేషన్ మంత్రి రాబర్ట్ జెన్రిక్స్ 28 ఓట్లతో అగ్రస్థానంలో నిలవగా, కెమీ బాడెనోచ్ 22 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జేమ్స్ క్లీవర్లీ 21 ఓట్లతో మూడో స్థానంలో ఉండగా, టామ్ తుగేన్‌ధాట్ 17 ఓట్లతో నాలుగో స్థానంలో, మెల్ స్ట్రైడ్ 16 ఓట్లతో ఐదో స్థానంలో, 14 ఓట్లతో ప్రీతి పటేల్ చివరి స్థానంలో నిలిచారు.దీంతో ప్రీతి చివరి స్థానంలో నిలవడంతో పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తదుపరి రెండో రౌండ్ వచ్చే మంగళవారం జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ చివరిలో జరిగే పార్టీ వార్షిక సమావేశానికి ముందు నలుగురు అభ్యర్థులు మిగిలి ఉంటారు.అక్టోబర్ 8 నుండి మిగతా రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉన్నంత వరకు ఓటింగ్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది.ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 2న వెలువడనున్నాయి. చివరిగా ఎవరు ఎక్కువగా ఓట్లు సాధిస్తారో వారినే ఎంపీలు విపక్షనేతగా ఎన్నుకుంటారు.దీంతో ఎవరు విజయం సాధిస్తారో అన్న ఉత్కంఠ కన్జర్వేటివ్ పార్టీ నాయకుల్లో నెలకొంది.