ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్..! పక్షపాతమా..?!
పక్షపాత ప్రయోజనాల కోసం.. Pope Francis shared a critical comments on Ukraine-Russia War.
దిశ, వెబ్‌డెస్క్ః తాజాగా, శుక్రవారం పోప్ ఫ్రాన్సిస్ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై స్పందించారు. ఈ యుద్ధాన్ని పక్షపాత ప్రయోజనాల కోసం చేస్తున్న "అధికార దుర్వినియోగం" అని అభివర్ణించారు. రక్షణ లేని ప్రజల పట్ల క్రూరమైన హింస తగదని వెల్లడించారు. అయితే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, పోప్ తన ఖండన వ్యాఖ్యల్లో "రష్యా" అనే పదాన్ని ఉపయోగించలేదు, బదులుగా, "ఆమోదయోగ్యం కాని సాయుధ దురాక్రమణ" అని తన అభిప్రాయాన్ని ప్రకటించారు. తాజాగా, స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన క్యాథలిక్ చర్చి సమావేశం సందర్భంగా ఇచ్చిన సందేశంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.