తృణధాన్యాలపై పాట రాసి పాడిన మోడీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలం కదిపారు.. గళం కలిపారు!!

Update: 2023-06-16 16:29 GMT

న్యూయార్క్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలం కదిపారు.. గళం కలిపారు!! "తృణధాన్యాల వల్ల ప్రపంచ ఆకలి సమస్యను ఎలా నిర్మూలించవచ్చు" అనే సందేశానికి గ్రామీ అవార్డు విజేత, భారత-అమెరికన్‌ గాయని ఫాల్గుణి షా (ఫాలు), మోడీ కలిసి పాట రూపమిచ్చారు. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉన్న ఈ పాటకు సంబంధించిన రచన, గాత్రం రెండింటిలోనూ ఫాలు, గౌరవ్‌ షా దంపతులతో కలిసి ప్రధాని పాలుపంచుకున్నారు. ఈ సాంగ్‌ను "అబండన్స్ ఇన్ మిల్లెట్స్" (Abundance in Millets) పేరుతో ఫాలు, ఆమె భర్త గౌరవ్‌ షా శుక్రవారం విడుదల చేశారు.

ఈ పాట మధ్యలో మోడీ స్వయంగా పలికిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గాయని ఫాలు ముంబైలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. 2022లో ఆమె ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గతేడాది ఢిల్లీకి వచ్చిన ఫాలు దంపతులు ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలోనే శ్రీఅన్నంపై పాట రాయాలని వారికి ప్రధాని మోడీ సూచించారు.


Similar News