బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదు: ఆర్మీ
బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ, అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం లేదని ఆ దేశ ఆర్మీ అభిప్రాయపడింది. తక్షణమే ఉన్నపలంగా హింసను ఆపాలని ఆ దేశ పౌరులను ఆర్మీ రిక్వెస్ట్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ, అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం లేదని ఆ దేశ ఆర్మీ అభిప్రాయపడింది. తక్షణమే ఉన్నపలంగా హింసను ఆపాలని ఆ దేశ పౌరులను ఆర్మీ రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం దేశంలో శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు వివిధ రాజకీయ పార్టీలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆర్మీ.. దేశంలో సైనిక పాలన విధించినట్లు అధికారికంగా ప్రకటించింది. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో నిరసనల నేపథ్యంలో ఆమె సోమవారం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైనిక విమానంలో కుటుంబంతో సహా భారత్‌కు వచ్చారు.సాయంత్రం 5.36 గంటలకు ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఆమె స్వాగతం పలికారు. అయితే, ఆమె భారత్ నుంచి లండన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.