భారత్‌లో ఉంటూ.. హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు: ముహమ్మద్ యూనస్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ గురువారం మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-09-05 09:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ గురువారం మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను తిరిగి బంగ్లాదేశ్ (ప్రభుత్వం) అప్పగించాలని కోరుకునే వరకు భారత్‌లో సైలెంట్‌గా ఉండాలన్నారు. లేకపోతే భారత్-బంగ్లా బలమైన సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. గురువారం ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన యూనస్, హసీనా భారత్‌లో మౌనంగా ఉండకుండా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివి బంగ్లాను ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రజల తిరుగుబాటు, ఆగ్రహంతో ఆమె పారిపోయింది. ఆమెను తిరిగి దేశానికి తీసుకురావాలి. చేసిన దురాగతాలను అందరి ముందు విచారించాల్సిందే అని యూనస్ అన్నారు.

అలాగే, భారత్-బంగ్లా రెండు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడకుండా సంబంధాన్ని మెరుగుపరచడానికి మేము కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. హసీనా ప్రభుత్వం పతనం తర్వాత దేశాల మధ్య మొదటి ఉన్నత స్థాయి సంప్రదింపులో యూనస్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్‌లో సంభాషించిన వారాల తర్వాత ఆయన నుంచి ఈ ప్రకటన వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాట్లతో ఆగష్టులో హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారతదేశంలో ఉండటంతో బంగ్లాలో రాజకీయ నేతలు ఆమెను తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా హసీనాను అప్పగించమని కోరలేదు. కానీ త్వరలో ఆమెను అప్పగించమని అడిగే అవకాశం ఉంది.


Similar News