Kamala Harris vs Donald Trump : కమలా హరీస్ పై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి నెలకొంది.

Update: 2024-08-13 21:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి నెలకొంది. మరో మూడు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధ్యక్ష అభ్యర్థులిద్దరు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.రిపబ్లికన్ నేత, డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న భారత సంతతి మహిళ కమలా హారీస్ పై ఇదివరకే చాలా సార్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇప్పుడు మరోసారి హారీస్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

సోమవారం ఎక్స్‌(X) అధినేత ఎలాన్‌ మస్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడూతూ.. "కమలా హారీస్ ఓ డమ్మీ అభ్యర్థి అని అలాగే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కంటే కమలా హారీస్ అసమర్థురాలని ట్రంప్ విమర్శించారు. కమలా ఈ ఎన్నికల్లో గెలిస్తే దేశం నాశనమవుతుందని తెలిపారు. కమలా హారిస్‌ ఒక రాడికల్‌ లెఫ్ట్‌ ఉన్మాది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. డెమొక్రటిక్‌ పార్టీలో తిరుగుబాటు కారణంగానే ఆ పార్టీ అభ్యర్థిగా బైడెన్‌ స్థానంలో కమలా హారిస్‌ను ఎన్నుకున్నారని ట్రంప్ వెల్లడించారు. 

Tags:    

Similar News