సంచలనంగా మారిన జియో హాట్‌స్టార్
భారతదేశంలో రిలయన్స్ జియోను ప్రారంభించినప్పటి నుంచి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో రిలయన్స్ జియోను ప్రారంభించినప్పటి నుంచి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రిలయన్స్ జియోకు సంబంధించిన జియో సినిమా ఓటీటీ యాప్.. ఇటీవల జియో హాట్‌స్టార్ తో కలిసిపోయింది. ఫిబ్రవరి 14, 2025న డిస్నీ+ హాట్‌స్టార్, జియోసినిమా అధికారికంగా విలీనం అయ్యాయి. విలీనం తర్వాత కేవలం రెండు నెలల్లో జియో హాట్ స్టార్ సంచలనంగా మారింది. 200 మిలియన్ల చెల్లింపు సబ్‌స్క్రైబర్‌లను అందుకుంది. జియో హాట్ స్టార్ విజయానికి ఐపీఎల్, ఐసీసీ వంటి మెగా ట్రోర్నీలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే జియో టెలికాం సంస్థ ఆఫర్లు కూడా ముఖ్య పాత్ర పోషించాయి..
జియో హాట్‌స్టార్ విజయానికి ప్రధాన కారణాలు
1. జియో హాట్‌స్టార్ విజయానికి క్రికెట్ జనాదరణ కీలక పాత్ర పోషించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ICC ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రముఖ క్రికెట్ ఈవెంట్‌ల ప్రత్యేక స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్‌స్టార్‌ను ఆకర్షించాయి. IPL 2025 మ్యాచ్‌లు, ముఖ్యంగా ఉప్పల్‌లో జరిగిన SRH vs PBKS మ్యాచ్ వంటివి, పెద్ద సంఖ్యలో వీక్షకులను ఆకర్షించాయి.
2. టెలికాం ఆఫర్‌లు.. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్‌లతో బండిల్ డీల్స్ ద్వారా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య వేగంగా పెరిగింది. ఉదాహరణకు, జియో యొక్క ₹949 ప్రీపెయిడ్ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించబడుతోంది.
3. విభిన్న కంటెంట్: 3 లక్షల గంటల కంటెంట్‌తో, డిస్నీ, HBO, పారామౌంట్ వంటి అంతర్జాతీయ స్టూడియోల సినిమాలు, టీవీ షోలు, స్థానిక భాషల్లోని కార్యక్రమాలు (10 భాషల్లో) లభ్యం కావడం. ‘స్పాక్స్’ విభాగంలో డిజిటల్ క్రియేటర్ల కంటెంట్ కూడా ఆకర్షణగా నిలిచింది.
4. ధరలు: ₹149/3 నెలలకు మొబైల్ ప్లాన్, ₹299/3 నెలలకు సూపర్ ప్లాన్, ₹499/3 నెలలకు ప్రీమియం (యాడ్-ఫ్రీ) ప్లాన్‌లతో సరసమైన ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఉచిత వీక్షణ వ్యవధి (10-15 నిమిషాలకు బదులు విస్తృతమైన ట్రయల్) కూడా సబ్‌స్క్రైబర్‌లను పెంచింది.
5. సాంకేతిక ఆవిష్కరణలు: 4K స్ట్రీమింగ్, AI-ఆధారిత రికమెండేషన్లు, మల్టీ-యాంగిల్ వీక్షణ, వాయిస్ సెర్చ్ వంటి ఫీచర్లు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచాయి.
జియో హాట్‌స్టార్ లాంచ్ సమయంలో 50 మిలియన్ చెల్లింపు సబ్‌స్క్రైబర్‌లతో మొదలై.. మార్చి నాటికి 100 మిలియన్‌కు చేరుకుంది. ఏప్రిల్ 11 నాటికి 200 మిలియన్‌ను అధిగమించింది. ఈ వృద్ధి భారత OTT మార్కెట్‌లో జియో హాట్‌స్టార్‌ను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలిపింది.