Italian Parliament: జీ7 శిఖరాగ్ర సదస్సులో పొట్టుపొట్టు కొట్టుకున్న ఎంపీలు..
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే.
దిశ వెబ్ డెస్క్: ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సదస్సులో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. సదస్సులో పాల్గొన్న ఎంపీలు, బాధ్యాతాయుత పదవుల్లో ఉన్న విషయాన్ని విస్మరించి వీధి గూండాల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని కల్పించే విధంగా ఇటలీలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో నూతన బిల్లు ప్రవేశ పెట్టారు.
అయితే ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎంపీ లియోనార్డో డోనో ప్రాంతీయ వ్యవహారాలు మరియు స్వయంప్రతిపత్తి మంత్రి రాబర్టో కాల్డెరోలి ముఖంపై ఇటాలియన్ జెండాను ఊపారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనితో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో లియోనార్డో డోనో మాట్లాడుతూ ఈ ఘర్షణలో తనకు బలమైన దెబ్బలు తాకాయని, దీనితో తాను ఊపిరి పీల్చుకోలేక కుప్పకూలిపోయానట్టు తెలిపారు. కాగా గాయపడిన లియోనార్డో డోనోని స్ట్రెక్చర్‌పై బయటకు తీసుకు వెళ్లినట్టు సమాచాకం. కాగా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అగ్రరాజ్యం అమెరికాతోసహా పలు దేశాలకు చెందిన నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బాధ్యాయుత పదవుల్లో ఉన్న విషయాన్ని విస్మరించి విచక్షణారహితంగా పరస్పరం దాడులకు దిగడం విమర్శలకు దారితీప్తోంది.