Israel : మేం చెప్పింది చేస్తేనే గాజా నుంచి వైదొలుగుతాం : నెతన్యాహు

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు.

Update: 2024-09-04 19:28 GMT
Israel : మేం చెప్పింది చేస్తేనే గాజా నుంచి వైదొలుగుతాం : నెతన్యాహు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. దక్షిణ గాజా నుంచి ఈజిప్టు సరిహద్దు వరకు ఉన్న ప్రాంతంలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు ఇక సాగవని భరోసా వచ్చేదాకా అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి కారణం హమాసే అని నెతన్యాహు ఆరోపించారు.

ఇజ్రాయెలీ బందీల విడుదలకు సంబంధించి తాము సూచించిన ప్రతిపాదనలన్నీ హమాస్ వ్యతిరేకించిందని మండిపడ్డారు. ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా కారిడార్‌పై పట్టుకోసం తాను తాపత్రయ పడుతున్నందు వల్లే హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం లేదనే ఆరోపణను ఆయన ఖండించారు. బుధవారం జెరూసలెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నెతన్యాహు ఈ కామెంట్స్ చేశారు.


Similar News