Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మళ్లీ అరెస్టు.. మరో కేసులో..

తోషాఖానా కేసులో అరెస్టయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం విడుదలయ్యారు.

Update: 2023-08-29 14:54 GMT

ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో అరెస్టయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం విడుదలయ్యారు. ఈ ఆనందం ఇమ్రాన్‌కు ఎంతోసేపు దక్కలేదు. జైలు నుంచి విడుదలైన గంటల వ్యవధిలోనే మరో కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన ఖరీదైన బహుమతులను వేలంలో అమ్ముకున్నట్టు తేలింది. దీంతో ఆయన్ను దోషిగా నిర్దారించిన ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు.. ఈ నెల 5న మూడేళ్ల శిక్ష విధించింది.

దీనిపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ కేసులో మూడేళ్ల జైలు శిక్షను నిలిపివేస్తూ, ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. శిక్షను సస్పెండ్ చేసినప్పటికీ, ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి నిషేధం మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన గంటల వ్యవధిలోనే.. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన మరో కేసులో ఇమ్రాన్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు.

Tags:    

Similar News