ఇమ్రాన్ పీఎంగా కొనసాగి ఉంటే పాకిస్తాన్ ఉండేదే కాదు.. పాక్ మాజీ ఆర్మీ చీఫ్

పాక్ మాజీ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-10 17:23 GMT

ఇస్లామాబాద్: పాక్ మాజీ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగి ఉంటే పాకిస్తాన్ ఉండేదే కాదని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కేబినెట్ మీటింగ్‌లో సౌదీ రాజు ప్రిన్స్ మోహమ్మద్ బిన్ సల్మాన్‌ను ఉద్దేశించి ఇమ్రాన్ పంజాబీ భాషలో దూషించారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఖాన్ కేబినెట్‌లోని ఓ మంత్రి సౌదీ రాయబారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పీటీఐ, పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ మధ్య రెండు ఓట్ల తేడా మాత్రమే ఉన్నందున నేషనల్ అసెంబ్లీకి రాజీనామా చేయొద్దని ఇమ్రాన్‌కు సలహా ఇచ్చానని, కానీ దానిని ఆయన పట్టించుకోలేదని చెప్పారు. ఇమ్రాన్ ప్రభుత్వంలో స్వప్రయోజనాల కోసం చూసుకుని ఉంటే తాను గౌరవంగా పదవి నుంచి తొలగిపోయే వాడినని తెలిపారు. కానీ దేశం కోసం త్యాగం చేయడానికే సిద్దపడ్డట్టు వెల్లడించారు.

Tags:    

Similar News