Seven Wonders : అతి తక్కువ టైంలో ఏడు వరల్డ్ వండర్స్‌ చూసొచ్చాడు

దిశ, నేషనల్ బ్యూరో : చాలా తక్కువ టైంలో ఏడు వరల్డ్ వండర్స్‌ను చూసొచ్చినందుకు ఈజిప్టుకు చెందిన మగ్డీ ఈసా(45)కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది.

Update: 2024-07-18 14:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో : చాలా తక్కువ టైంలో ఏడు వరల్డ్ వండర్స్‌ను చూసొచ్చినందుకు ఈజిప్టుకు చెందిన మగ్డీ ఈసా(45)కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది. ఆయన కేవలం 6 రోజుల 11 గంటల 52 నిమిషాల్లోనే ఈ అద్భుతమైన ఫీట్‌ను పూర్తి చేశారు. ఇదే విభాగంలో గతంలో ఇంగ్లిష్‌ ఆటగాడు జామీ మెక్‌డొనాల్డ్‌ నెలకొల్పిన రికార్డును 4.5 గంటల తేడాతో మగ్డీ ఈసా అధిగమించారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సందర్శనతో మగ్డీ ఈసా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత భారత్‌కు వచ్చి తాజ్ మహల్‌ను చూశారు. ఇక్కడి నుంచి జోర్డాన్‌‌కు చేరుకొని రోజ్ సిటీ పెట్రాను విజిట్ చేశారు. అనంతరం రోమ్‌లోని కొలోసియం, బ్రెజిల్‌లోని క్రైస్ట్ ది రిడీమర్స్ చాచిన చేతులు, పెరూలోని మచు పిచ్చు నగరాన్ని ఈసా చూశారు. ఆయన జర్నీ మెక్సికోలోని చిచెన్ ఇట్జా ప్రాంతంలో ఉన్న పురాతన మయన్ మహానగరం సందర్శనతో ముగిసింది. మగ్డీ ఈసా వరల్డ్ రికార్డును సాధించారని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గిన్నిస్ బుక్ ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని అద్బుత నిర్మాణాలను చూడాలనేది తన చిన్ననాటి కల అని.. దాన్ని నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉందని ఈసా తెలిపారు.

Tags:    

Similar News