Earthquake : తైవాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు

తైవాన్‌ దేశాన్ని భూకంపం వణికించింది.

Update: 2024-08-16 01:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తైవాన్‌ దేశాన్ని భూకంపం వణికించింది. సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ (CWA) ప్రకారం.. తూర్పు తైవాన్‌లో శుక్రవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని సమాచారం. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం,ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.తైవాన్‌లోని హువాలియన్ కౌంటీ, టైటుంగ్ కౌంటీ, యిలాన్ కౌంటీ, నాంటౌ కౌంటీ, యున్లిన్ కౌంటీ ప్రాంతాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4గా నమోదయ్యాయి.అలాగే హ్సించు కౌంటీ, మియోలీ కౌంటీ, తయోయువాన్, న్యూ తైపీ, చియాయ్, కయోసియుంగ్ ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రం హువాలియన్ కౌంటీ హాల్‌కు ఆగ్నేయంగా 34.2 కి.మీ దూరంలో 9.7 కి.మీ ఫోకల్ డెప్త్‌తో ఉందని సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ CWA నివేదించింది.ఈ భూకంపం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News