US Presidential Election: అమెరికా అధ్యక్షుడి కీలక నిర్ణయం

ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి రుణమాఫీ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు జో బైడెన్ (Joe Biden) ప్రకటించారు.

Update: 2024-07-19 03:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి రుణమాఫీ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు జో బైడెన్ (Joe Biden) ప్రకటించారు. 35 వేల మంది అమెరికన్ల రుణాలు రద్దు చేసినట్లు తెలిపారు. దీంతో, ఇప్పటివరకు దాదాపు 4.76 లక్షల మందికి 1.2 బిలియన్ డాలర్ల (సుమారు వెయ్యికోట్లు)రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి సగటున 35 వేల డాలర్ల రుణం రద్దు అవుతుందని అన్నారు. లబ్ధిదారుల్లో టీచర్లు, నర్సులు, పోలీసులు ఉన్నారని తెలిపారు. ఇకపోతే, మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం. రుణమాఫీ చేయకుండా అధికారులు అడ్డుకున్నా.. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో తెచ్చే పనిని ఎప్పటికీ ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో యువ ఓటు బ్యాంకు గెలుచుకునే ప్రయత్నంలో లక్షలాది మంది అమెరికన్లకు రుణ మాఫీ చేసేందుకు ప్రణాళికలు ఆవిష్కరించారు. గతేడాది 1.5 లక్షల మందికి రుణమాఫీ చేస్తానని ప్రకటించిన బైడెన్.. గత నెలలో 1.6 లక్షల మందికి ఊరట కల్పించారు. కాగా.. రుణాన్ని రద్దు చేయాలనే డెమోక్రాట్ ప్రతిపాదనలను యూఎస్ సుప్రీంకోర్టు గతేడాది కొట్టివేయడం గమనార్హం.

Tags:    

Similar News