చైనాలో కరోనా విజృంభణ.. చేపలకి, పీతలక్కూడా RT-PCR టెస్ట్! (వీడియో)
చైనీస్ మీడియాలో వైరల్‌గా మారగా, రచ్చ రచ్చ అయ్యి, చర్చకు దారితీశాయి. Fish And Crabs Also Undergo RT-PCR Test In China.
దిశ, వెబ్‌డెస్క్ః చైనాలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా ఆనివార్యమయ్యింది. క్వారెంటైన్‌లకు భయపడి ప్రజలు తప్పించుకు పారిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు, BBC నివేదిక ప్రకారం, ఐదు మిలియన్ల మందికి పైగా ప్రజలు పరీక్షలు చేయించుకోవాలని చైనా ఆదేశాలు జారీచేసింది. ఇక, ఇలాంటి తరుణంలో చైనాలోని జియామెన్ ప్రాంతంలోని అధికారులు వైరస్ కోసం సముద్ర జీవులను కూడా పరీక్షించడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన పలు వీడియోలు ఈ విషయాన్ని నిర్థారించాయి. వీటిలో కోవిడ్ వైరస్ కోసం ఆరోగ్య కార్యకర్తలు చేపలు, పీతలు వంటి సముద్ర జీవుల్ని కూడా పరీక్షిస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు PPE కిట్‌లు ధరించి, COVD పరీక్షల కోసం చేపల నోటిలో పొడవడం, అలాగే, పీతల పెంకులను చొప్పించడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలు చైనీస్ మీడియాలో వైరల్‌గా మారగా, రచ్చ రచ్చ అయ్యి, చర్చకు దారితీశాయి.
Videos of pandemic medical workers giving live seafood PCR tests have gone viral on Chinese social media. pic.twitter.com/C7IJYE7Ses
— South China Morning Post (@SCMPNews) August 18, 2022