ప‌ట్టుమ‌ని ప‌దేళ్లే..! కానీ, యుద్ధ‌భూమి నుండి ఇలా త‌ప్పించుకున్నాడు!

బ‌య‌ట‌ బాంబుల వ‌ర్షం.. త‌ప్పించుకోడానికి కూడా అనువుగాని స్థితి. An Ukrainian boy of 11 YO travelled to Slovakia alone.

Update: 2022-03-07 07:39 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉధ్రిక్త‌త‌లు ఏమాత్రం త‌గ్గుమొఖం ప‌ట్ట‌ట్లేదు. ఇరుదేశాల మ‌ధ్య నానాటికీ పెరిగిపోతున్న యుద్ధంతో ఉక్రెయిన్‌లోని సాధార‌ణ ప్ర‌జ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. బ‌య‌ట‌ బాంబుల వ‌ర్షం. త‌ప్పించుకోడానికి కూడా అనువుగాని స్థితి నెల‌కొంది. ఎలాగొలా స‌రిహ‌ద్దులు దాటుదామ‌న్నాకాలుకూడా అన్చ‌లేనంత కిక్కిర్సిన రైళ్లల్లో జ‌నం ప‌ట్ట‌ట్లేదు. ఈ ప‌రిస్థితుల్లో త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్నైనా కాపాడుకోడానికి నానా యాత‌నప‌డుతున్నారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో 11 ఏళ్ల ఉక్రేనియన్ బాలుడు భుజంపై బ్యాక్‌ప్యాక్, త‌న తల్లి ఇచ్చిన ఓ నోట్, గ‌మ్యానికి చెందిన‌ టెలిఫోన్ నంబర్‌తో ఒంట‌రిగా యుద్ధ భూమి నుంచి బ‌య‌లుదేరాడు. ఏకంగా 1,000 కి.మీ ప్రయాణించి స్లోవేకియాకు చేరుకున్నాడు.

ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియాకు చెందిన బాలుడిత‌డు. గత వారం రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న పవర్ ప్లాంట్ ఈ ప్రదేశంలోనే ఉంది. అయితే, అనారోగ్యంతో ఉన్న త‌మ బంధువును చూసుకోవడానికి బాలుడి తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లోనే ఉండాల్సి వ‌చ్చింది. దానితో, బాలుణ్ని మాత్ర‌మే యుద్ధ‌భూమి నుంచి పంపించాల్సి వ‌చ్చింది. చుట్టూ యుద్ధం మ‌ధ్య‌లో ఎంతో ధైర్యంగా స్లోవేకియాకు వ‌చ్చిన ఈ బాలుణ్ని ఆ దేశ‌ అంతర్గత మంత్రిత్వ శాఖ "ది బిగ్గెస్ట్ హీరో ఆఫ్ లాస్ట్ నైట్‌" అంటూ ప్ర‌శ‌సించింది. స్లోవేకియా ఇంటీరియర్ మినిస్ట్రీ ఫేస్‌బుక్ పేజీలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. 

Full View

Tags:    

Similar News