ఎయిర్ హోస్టెస్ కెమెరాకు చిక్కిన పింక్ గ్రహాంతరవాసి..

ఏవైనా కొత్త విషయాలను విన్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం.

Update: 2024-01-19 12:34 GMT

దిశ, ఫీచర్స్ : ఏవైనా కొత్త విషయాలను విన్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. దాని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు. ముఖ్యంగా గ్రహాంతరవాసుల గురించి, యూఎఫ్‌ఓలకు గురించిన ప్రతి విషయాలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు. గ్రహాంతర వాసుల గురించి టీవీల్లో, ఇంటర్నెట్‌లో వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హంగేరియన్ ఎయిర్‌లైన్ కంపెనీకి చెందిన విమానం గాలిలో ఎగురుతున్న సమయంలో ఎయిర్ హోస్టెస్ ఎగురుతున్న విమానం వెలుపల ఓ వింత ఆకారాన్ని చూసి దాన్ని వీడియో తీసింది. ఇప్పుడు ఆ పింక్ UFO వైరల్ వీడియో అవుతుంది. వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ ఎవరు ఎలా వీడియోను తీసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

36 ఏళ్ల డెనిసా టెనాస్సే విజ్ హంగేరియన్ ఎయిర్‌లైన్ కంపెనీకి చెందిన విమానంలో ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తుంది. ఈమె మీడియాతో మాట్లాడుతూ పోలాండ్‌లోని లుటన్ నుండి స్జిమనీకి ప్రయాణిస్తున్నప్పుడు, ఆకాశంలో ఊదా రంగులో మెరుస్తున్న ఒక వింత ఆకారాన్ని చూశానని చెప్పారు. ఇలాంటి వింత విమానాన్ని చూసినప్పుడు అది ఏలియన్స్ కి చెందిన స్పేస్షిప్ అనుకున్నానని తెలిపారు. తాను ఈ దృశ్యాన్ని వీడియో తీసి పైలట్‌కి ఇచ్చినా అతను నమ్మలేదన్నారు. ఆకాశంలో ఇది పింక్ కలర్ లో వృత్తాలుగా కదులుతున్న ఆకారాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపోయానని అన్నారు. ఆకాశంలో ఈ ఆకారం ప్రకాశవంతంగా ఎగురుతున్నదని ఆమె పేర్కొన్నారు. ఈ సీన్ చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పెర్కొన్నారు. ఇలాంటి సీన్ ని నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. అదే వీడియోను డెనిసా తన కుటుంబ సభ్యులకు కూడా చూపించిందని తెలిపారు.

Tags:    

Similar News