చైనాలో బస్సు ప్రమాదం..14మంది మృతి
చైనాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా..37 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: చైనాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా..37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర చైనా షాంగ్సీ ప్రావిన్స్‌లోని హుబే రహదారిపై మంగళవారం ఈ ప్రమాదం జరగగా.. చైనా ప్రభుత్వ మీడియా ఈ వివరాలను బుధవారం వెల్లడించింది. 71 మంది ప్రయాణికులతో కూడిన బస్సు హుబే ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా..ఓ సొరంగంలో గోడను ఢీ కొట్టింది. దీంతో అక్కడి కక్కడే 14 మంది మరణించారు. విషయం తెలుసుకున్న రెస్య్కూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు.
అలాగే తూర్పు చైనాలో మరో ఘటన చోటు చేసుకుంది. జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న తైజౌలోని వృత్తి విద్యా పాఠశాల వద్ద ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మరణించగా..16మంది క్షతగాత్రులయ్యారు. కాగా, ఈనెల1న కూడా తూర్పు చైనాలోని షాన్ డాంగ్ ప్రావీన్సులో ఓ కారు ప్రజల పైకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కఠినమైన భద్రతా నియంత్రణలు లేకపోవడం వల్లే చైనాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.