2023నాటికి బ్రిటన్‌ను దాటనున్న భారత్.. వెల్లడించిన నివేదిక

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆర్థికవ్యవస్థ 2022లో మొదటిసారిగా 100 ట్రిలీయన్ డాలర్లను అధిగమిస్తుందని ఓ నివేదిక తెలిపింది. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్(సీఈబీఆర్) ప్రకారం, అమెరికాను వెనక్కి నెట్టి చైనా నంబర్ వన్ ఆర్థికవ్యవస్థగా మారేందుకు మరింత సమయం పడుతుందని వెల్లడించింది. గతంలో వరల్డ్ ఎకనామిక్ లీగ్ 2028లో చైనా ప్రపంచ దిగ్గజ ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని అంచనా వేసింది. కానీ, ఇది కొంచెం ఆలస్యంగా 2030 నాటికి గాని సాధ్యం కాకపోవచ్చని బ్రిటిష్ కన్సల్టెన్సీ […]

Update: 2021-12-26 05:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆర్థికవ్యవస్థ 2022లో మొదటిసారిగా 100 ట్రిలీయన్ డాలర్లను అధిగమిస్తుందని ఓ నివేదిక తెలిపింది. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్(సీఈబీఆర్) ప్రకారం, అమెరికాను వెనక్కి నెట్టి చైనా నంబర్ వన్ ఆర్థికవ్యవస్థగా మారేందుకు మరింత సమయం పడుతుందని వెల్లడించింది. గతంలో వరల్డ్ ఎకనామిక్ లీగ్ 2028లో చైనా ప్రపంచ దిగ్గజ ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని అంచనా వేసింది. కానీ, ఇది కొంచెం ఆలస్యంగా 2030 నాటికి గాని సాధ్యం కాకపోవచ్చని బ్రిటిష్ కన్సల్టెన్సీ అభిప్రాయపడింది.

భారత్ 2022లో ఫ్రాన్స్‌ను అధిగమించనుందని, అటు తర్వాత 2023లోనే బ్రిటన్‌ను దాటి ప్రపంచంలోనే ఆరవ ఆర్థికవ్యవస్థగా నిలువనుందని వారు అభిప్రాయపడ్డారు. ‘ఈ దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాయనేది కీలకం కానుందని, ఈ ప్రతికూలతను నియంత్రించకపోతే 2023, 2024 నాటికి ప్రపంచ ఆర్థికవ్యవస్థలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనలేవని’ సీఈబీఆర్ డిప్యూటీ డగ్లస్ మెక్‌విలియమ్స్ చెప్పారు. నివేదిక అంచనాల ప్రకారం.. 2033 నాటికి జర్మనీ ఆర్థికవ్యవస్థ జపాన్‌ను అధిగమించవచ్చ్ని, అదేవిధంగా ఇండోనేషియా 2034 నాటికి తొమ్మిదో ఆర్థిక వ్యవస్థ మారుతుందని, రష్యా 2033 సమయానికి మొదటి పది ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని వెల్లడించింది.

Tags:    

Similar News