ప్రాణత్యాగాలను వృథా కానివ్వం: ఐఏఎఫ్ చీఫ్

హైదరాబాద్: లడాఖ్ గాల్వన్ లోయలో మన వీర జవాన్లు చేసిన ప్రాణ త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో వృథాగా పోనివ్వమని వైమానిక దళం చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. వైమానిక దళం తన శక్తి సామర్థ్యాల మేరకు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నదని, గాల్వన్ లోయలో ఎటువంటి ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నా.. ఎదుర్కొనేందుకు తగినవిధంగా వైమానిక దళాలు మోహరించి ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోని దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఉద్దేశిస్తూ […]

Update: 2020-06-20 08:24 GMT

హైదరాబాద్: లడాఖ్ గాల్వన్ లోయలో మన వీర జవాన్లు చేసిన ప్రాణ త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో వృథాగా పోనివ్వమని వైమానిక దళం చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. వైమానిక దళం తన శక్తి సామర్థ్యాల మేరకు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నదని, గాల్వన్ లోయలో ఎటువంటి ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నా.. ఎదుర్కొనేందుకు తగినవిధంగా వైమానిక దళాలు మోహరించి ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోని దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ మేరకు వివరించారు. రక్షణ దళాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండే పరిస్థితులను భౌగిళక పరిస్థితులు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. లడాఖ్‌లోని ఎల్ఏసీ ఘటన ఒక కుదుపు అని చెప్పారు. మిలిటరీ చర్చల ద్వారా కొన్ని ఒప్పందాలు చేసుకున్నాక కూడా గాల్వన్ ఘటన ఏర్పడటం దురదృష్టకరమని, సరిహద్దు దగ్గర పరిస్థితులు శాంతియుతంగా మారాలని ఆయన ఆశించారు. కాగా, చైనా ఆర్మీతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన 20 మంది దేశ సార్వభౌమత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో రక్షించుకోవాలనే సూచనలను అందించారని వివరించారు.

Tags:    

Similar News