ట్రీట్మెంట్ పేరుతో 15 మంది రోగులతో ‘సెక్స్’ చేసిన డాక్టర్.. లేడి జర్నలిస్టు ఏం చేసిందంటే..!

దిశ, వెబ్‌డెస్క్ : అనారోగ్య సమస్యలతో తన వద్దకు వస్తున్న మహిళా రోగులను ఓ డాక్టర్ క్యూర్ పేరుతో లైంగికంగా వాడుకున్నాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మందితో శృంగారం చేశారు. అతని వలన ఇబ్బందులు పడిన ఓ మహిళా ఈ విషయాన్ని ఓ టీవీ చానెల్‌కు వివరించగా.. వారు అతన్ని టార్గెట్ చేసి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అతని చేసే పాడు పనిని బాహ్య ప్రపంచానికి చూపారు. ఈ ఘటన ఇటలీ దేశంలో […]

Update: 2021-11-26 12:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అనారోగ్య సమస్యలతో తన వద్దకు వస్తున్న మహిళా రోగులను ఓ డాక్టర్ క్యూర్ పేరుతో లైంగికంగా వాడుకున్నాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మందితో శృంగారం చేశారు. అతని వలన ఇబ్బందులు పడిన ఓ మహిళా ఈ విషయాన్ని ఓ టీవీ చానెల్‌కు వివరించగా.. వారు అతన్ని టార్గెట్ చేసి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అతని చేసే పాడు పనిని బాహ్య ప్రపంచానికి చూపారు. ఈ ఘటన ఇటలీ దేశంలో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఇటలీకి చెందిన ఓ గైనకాలజిస్ట్ చాలా ఫేమస్. అతని వద్దకు గైనిక్ సమస్యలు, ప్రెగ్నె్న్సీ కావడం లేదని, క్యాన్సర్‌తో బాధపడే రోగులు ఎక్కువగా వచ్చేవారట.. అయితే, 60ఏళ్ల వయస్సున్న ‘గియోవన్నీ వినియెల్లో’ అనే పేరు గల డాక్టర్ రోగులను పరీక్షించి.. నీ వ్యాధిని నేను క్యూర్ చేస్తానని నమ్మబలికేవాడు. గైనిక్ సమస్యలు సమస్యలు కావడంతో లేడిస్ రహస్య భాగాల్లో టచ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడట.. ట్రీట్మెంట్ పేరుతో ఏకంగా 15 మంది రోగులతో సెక్స్ చేశాడు. అయితే, ఇతని నిజస్వరూపం తెలుసుకున్న ఓ బాధితురాలు ఈ విషయాన్ని ఇటాలియన్ టీవీ షోకు చెప్పింది. వారు స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టాలనుకున్నారు. ఓ లేడి జర్నలిస్టును అందుకోసం ప్రిపేర్ చేయించి రోగి మాదిరిగా పంపించారు. డాక్టర్ గురించి ముందే తెలిసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ప్రీ ప్లాన్డ్‌గా హోటల్ గదిలో మొత్తం కెమెరాలు ఫిక్స్ చేసింది.

ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతుండగానే వినియెల్లో ఆమెను కిస్ చేయడానికి ప్రయత్నించాడు. దాంతో ఆమె అతన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. ఆ తర్వాత నీకు HIV లక్షణాలు ఉన్నాయని, ఆమె సీక్రెట్స్ పార్ట్స్ టచ్ చేసి చెప్పాడు. పర్లేదు దీనిని నేను క్యూర్ చేస్తానని చెబుతూ.. అతని బట్టలు విప్పి ఆమె క్లాత్స్ కూడా విప్పాలని బలవతం చేశాడు. తీరా అతను చేయాలనుకున్న పనికి సంబంధించి దృశ్యాలు మొత్తం రికార్డయ్యాయి. చివరకు చానెల్ కు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆమెను రక్షించి ఆ ఫుటేజీని ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో అతను తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అతని బాధితుల ఫిర్యాదు మేరకు అతనిపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు. కాగా, ధైర్యంగా అతని చీకటి గుట్టును విప్పిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టును అన్నా మారియాగా గుర్తించారు.

Tags:    

Similar News