విమెన్స్ డే : ఢిల్లీకి 40వేల మంది మహిళా రైతులు
న్యూఢిల్లీ : వంటింటి కుందేలులం కాదు.. కదనరంగంలో శివంగులం అని మహిళా రైతులు ఆందోళన బాటపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్, హర్యానా నుంచి సుమారు 40 వేల మంది మహిళలు ఢిల్లీలోని ఆందోళన వేదికలకు బయల్దేరారు. వేలాది మంది మహిళలు సొంతంగా ట్రాక్టర్లు నడుపుతూ రణస్థలికి ప్రయాణంకట్టారు. రైతులు ఆందోళనల వేదికలు సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లకు చేరి సోమవారం నిరసనల్లో వారే సారథ్యం వహించనున్నారు. సాగులో, జీవితాల్లో మహిళల పాత్రను గుర్తిస్తూ ఈ ఆందోళనలు […]
న్యూఢిల్లీ : వంటింటి కుందేలులం కాదు.. కదనరంగంలో శివంగులం అని మహిళా రైతులు ఆందోళన బాటపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్, హర్యానా నుంచి సుమారు 40 వేల మంది మహిళలు ఢిల్లీలోని ఆందోళన వేదికలకు బయల్దేరారు. వేలాది మంది మహిళలు సొంతంగా ట్రాక్టర్లు నడుపుతూ రణస్థలికి ప్రయాణంకట్టారు. రైతులు ఆందోళనల వేదికలు సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లకు చేరి సోమవారం నిరసనల్లో వారే సారథ్యం వహించనున్నారు. సాగులో, జీవితాల్లో మహిళల పాత్రను గుర్తిస్తూ ఈ ఆందోళనలు సాగనున్నాయి.
రైతు ఆందోళనల్లో మహిళా మణుల శక్తిని గుర్తించి సముచిత స్థానాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినట్టు రైతు నేత యోగేంద్ర యాదవ్ అన్నారు. సోమవారం అన్ని నిరసనలకు మహిళలే నాయకత్వం వహిస్తారని, టోల్ గేట్ల దిగ్బంధనమైనా, ఢిల్లీ సరిహద్దుల్లోని ఆందోళనల్లోనైనా వారిదే కీలకపాత్ర అని తెలిపారు. ప్రతి రైతు సంఘానికి మహిళా విభాగాలున్నాయి. భారతీయ కిసాన్ యూనియన్(యూ)కు అతిపెద్ద మహిళా విభాగం ఉన్నది. మహిళలను ఢిల్లీకి చేర్చడానికి 500 బస్సులు, 600 మినీ బస్సులు, 115 ట్రక్కులు, 200 చిన్న చిన్న వెహికిల్స్ ఏర్పాటుచేశామని భారతీయ కిసాన్ యూనియన్(యూ) జనరల్ సెక్రెటరీ సుఖ్‌దేవ్ సింగ్ కోక్రికాలన్ తెలిపారు. సోమవారం నిరసనలు చేసి మరుసటి రోజు మళ్లీ ఇంటికి తిరిగి వెళ్తారని వివరించారు.