కరోనా సాయం కోసం క్యూలైన్‌.. గుండెపోటుతో మహిళ మృతి

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు సహాయం తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన మహిళ క్యూలైన్‌లోనే మృతిచెందన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం వివరాలు రామారెడ్డిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ప్రభుత్వం ఖాతాల్లో వేసిన రూ. 1500 తీసుకోవడం కోసం జనం బారులు తీరారు. ఉదయం నుంచి క్యూల్యైన్‌లో నిలబడిన కన్నపూర్ తండా వాసి నేనావత్ కమల(45) గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్నవారు వెంటనే 108కు […]

Update: 2020-04-17 04:13 GMT

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు సహాయం తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన మహిళ క్యూలైన్‌లోనే మృతిచెందన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం వివరాలు రామారెడ్డిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ప్రభుత్వం ఖాతాల్లో వేసిన రూ. 1500 తీసుకోవడం కోసం జనం బారులు తీరారు. ఉదయం నుంచి క్యూల్యైన్‌లో నిలబడిన కన్నపూర్ తండా వాసి నేనావత్ కమల(45) గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్నవారు వెంటనే 108కు సమాచారం అందించారు. సిబ్బంది చేరుకునే ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే కమల మృతిచెందారు. క్యూలైన్‌లోనే మహిళ మృతిచెందడంతో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. ఖతాదారుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, టోకెన్ ప్రకారం డబ్బులు చెల్లించే ఏర్పాటు చేసినా, విషాదం చోటుచేసుకుందని రామారెడ్డి సర్పంచ్ సంజీవులు వాపోయారు.

Tags: corona,lock down,heart stroke, women died, waiting in queline, corona help fund, tgb

Tags:    

Similar News